ఈస్ట్ కోస్ట్ రైల్వేపై ‘కరోనా’ ప్రభావం.. గత ఆరు రోజులుగా లక్షకు పైగా టికెట్లు రద్దు!
- గత ఏడాదిలో జరిగిన టికెట్ల రద్దు కంటే ఇది 67 శాతం ఎక్కువ
- దేశ వ్యాప్తంగా చూస్తే 80 శాతం టికెట్లు రద్దు
- ‘కరోనా’ ప్రభావంతో పలు ప్రత్యేక రైళ్లు కూడా రద్దు
గత ఆరు రోజులుగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో లక్షకు పైగా టికెట్లు రద్దయ్యాయి. గత ఏడాది మొత్తంలో జరిగిన టికెట్ల రద్దు కంటే 67 శాతం ఎక్కువగా జరిగింది. అదే, దేశ వ్యాప్తంగా చూస్తే కనుక 80 శాతం టికెట్లు రద్దయ్యాయి. ‘కరోనా’ ప్రభావంతో పలు ప్రత్యేక రైళ్లు కూడా రద్దయ్యాయి. మహారాష్ట్రలో ‘కరోనా’ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముంబై నుంచి తెలంగాణ మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేశారు.