ఇలా ద్రోహులను చొప్పించడం టెర్రర్ గ్రూపుల కంటే ఘోరం కాదా?: విజయసాయిరెడ్డి
- చంద్రబాబు స్లీపర్ సెల్స్ ను చొప్పించారంటూ విమర్శలు
- ప్రజలు ప్రశాంతంగా ఉండడం చంద్రబాబుకు ఇష్టంలేదని వ్యాఖ్యలు
- నిధులు రాకపోతే ఏంటని ఈ నిద్రాణశక్తులు అంటున్నాయని ట్వీట్
ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతోంది కూడా అదేనని, చంద్రబాబు సీఎంగా లేని రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి వీల్లేదని, వ్యవస్థలోకి ఆయన చొప్పించిన స్లీపర్ సెల్స్ కరాఖండీగా చెబుతున్నాయని విమర్శించారు. దేశం కంటే కులమే గొప్పదని, తమ దేవుడు చంద్రబాబు అంతకంటే గొప్పవాడని, ఆర్థిక సంఘం నిధులు రూ.5 వేల కోట్లు రాకపోతే మాకేంటి అని ఈ నిద్రాణ శక్తులు అంటున్నాయని మండిపడ్డారు.