ఆరు వారాలు కాదు.. 60 వారాల తర్వాత ఎన్నికలు జరిగినా ఇంతే!: విజయసాయిరెడ్డి

  • బాబూ.. నీ అడ్రసు గల్లంతవక తప్పదు
  • వ్యవస్థల్లో నీ మనుషులున్నారు కదా అని ఎలక్షన్లు నిలిపి వేయించావ్
  • 5 వేల కోట్ల రూపాయల నిధులు రాకుండా చేశావ్ 
  • నీచ రాజకీయాల చరమాంకానికి నువ్వే దారి వేసుకున్నావ్ 
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేయడాన్ని టీడీపీ నేతలు స్వాగతిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు.

'బాబూ... ఆరు వారాలు కాదు, 60 వారాల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగినా నీ అడ్రసు గల్లంతవక తప్పదు. వ్యవస్థల్లో నీ మనుషులున్నారు కదా అని ఎలక్షన్లు నిలిపి వేయించావ్. 5 వేల కోట్ల రూపాయల నిధులు రాకుండా చేసి ఐదు కోట్ల మంది ప్రజలకు ద్రోహం చేశావు. నీ నీచ రాజకీయాల చరమాంకానికి నువ్వే దారి వేసుకున్నావ్' అని విజయసాయిరెడ్డి విమర్శించారు. 


Vijay Sai Reddy
YSRCP
Andhra Pradesh

More Telugu News