ప్రేమ, పెళ్లి పేరుతో నేపాల్ బాలికకు వల.. హైదరాబాద్ వచ్చాక వేధింపులు

nepali women filed cheating case
  • తన కంటే 13 ఏళ్ల చిన్నదైన మైనర్‌తో లైంగిక సంబంధం
  • భార్య చనిపోయాక పూర్వీకులదైన నేపాల్ వెళ్లిన నిందితుడు 
  • అక్కడి నుంచి బాలికతో హైదరాబాద్ రాక

తన కంటే 13 ఏళ్లు చిన్నదైన బాలికకు ప్రేమ, పెళ్లి అంటూ ఆశ చూపించి ఆమెపై అత్యాచారం చేయడమేకాక, పెళ్లి చేసుకోమన్నందుకు వేధిస్తున్న ఓ మృగాడి తీరు హైదరాబాద్ లో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు...మొఘల్ పురా సమీపంలోని హరిబౌలికి చెందిన శివ (28) పూర్వీకులది నేపాల్. భార్యతోపాటు హరిబౌలిలో ఉంటుండేవాడు. నాలుగేళ్ల క్రితం ఇతని భార్య చనిపోయింది. ఏడాదిన్నర క్రితం శివ నేపాల్ వెళ్లాడు. పాత పరిచయాలను ఉపయోగించుకుని అక్కడ ఓ పదిహేనేళ్ల బాలికకు వలవిసిరాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెతోపాటు హైదరాబాద్ వచ్చి హరిబౌలిలో కాపురం పెట్టాడు.

వారం రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ జరగడంతో విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఈ సందర్భంగా శివ చేసిన మోసాన్ని ఆమె బయట పెట్టింది. 'నన్ను పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో హైదరాబాద్ తెచ్చాడు. ఇక్కడికి వచ్చాక లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లికి ఒత్తిడి చేయడంతో వేధింపులకు గురిచేస్తున్నాడు' అంటూ సదరు బాలిక పోలీసుల ముందు వాపోయింది. పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

Go Back to Shorts
Nepal
Hyderabad
Cheating

More Telugu News