నాని, సుధీర్ బాబుల సినిమా 'వి' విడుదల వాయిదా
- విడుదలను వచ్చే నెలకు వాయిదా వేసిన శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్
- కరోనా కారణంగా విడుదల వాయిదా
- ప్రేక్షకుల ఆరోగ్యం తమకు ముఖ్యమంటూ ప్రకటన
నిర్ణీత సమయానికి సినిమాను విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేశామని... అయితే, కరోనా కారణంగా తమ నిర్ణయాన్ని మార్చుకున్నామని శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ తెలిపింది. ప్రేక్షకుల ఆరోగ్యం, క్షేమం తమకు ముఖ్యమని... అది తమ బాధ్యత అని చెప్పింది. సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామని... వచ్చే నెలలో విడుదల చేస్తామని తెలిపింది. కరోనా నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరింది.