అనంతగిరి హిల్స్ టీబీ ఆసుపత్రిలో కరోనా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటుపై అభ్యంతరం!
- ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న స్థానికులు
- అంటురోగాలు మాకు వ్యాపింపజేస్తారా? అంటూ అభ్యంతరం
- అభివృద్ధి పట్టించుకోకుండా ఇదా మీ నిర్వాకం అంటూ మండిపాటు
అధికార పార్టీ స్థానిక నాయకులపై కూడా మండిపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న తమ ప్రాంతంలో కరోనా వంటి భయంకరమైన వైరస్‌లు వ్యాపించేలా చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ చర్యను నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు ఇక్కడి ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన తెలియజేయగా పోలీసులు వారిని అరెస్టు చేసి తరలించారు.