మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ సంచలన నిర్ణయం.. డైరెక్టర్స్ బోర్డుకు రాజీనామా
- డైరెక్టర్ల బోర్డు, బెర్క్‌షైర్ హాత్వే బోర్డు నుంచి తప్పుకున్న బిల్
- దాతృత్వ కార్యక్రమాలకు మరింత సమయాన్ని వెచ్చించేందుకే..
- ఆయనతో కలిసి పనిచేయడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పిన సత్య నాదెళ్ల
ఈ సందర్భంగా బిల్‌గేట్స్ మాట్లాడుతూ.. బెర్క్‌షైర్ కంపెనీలు, మైక్రోసాఫ్ట్ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉన్నాయని, దాతృత్వ కార్యక్రమాలకు మరింత సమయం వెచ్చించేందుకు ఇదే సరైన సమయమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
బిల్‌గేట్స్ రాజీనామాపై సత్య నాదెళ్ల స్పందించారు. కొన్నేళ్లపాటు బిల్‌గేట్స్‌తో కలిసి పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఆయన నాయకత్వం వల్ల సంస్థకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు. బిల్‌గేట్స్‌తో కలిసి పనిచేసేందుకు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.