రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది... పెండింగ్ నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం: బుగ్గన
- ఢిల్లీలో నిర్మలా సీతారామన్ ను కలిసిన బుగ్గన
- రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి
- చంద్రబాబు ప్రభుత్వం రూ.60 వేల కోట్ల బకాయిలు పెట్టిందని ఆరోపణ
గత రెండేళ్లుగా గ్రామ, మున్సిపాలిటీలకు నిధులు రాలేదని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం రూ.60 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టిందని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పెండింగ్ నిధులను కోరామని అన్నారు. రాష్ట్ర వ్యవసాయ, నీటిపారుదల పథకాల గురించి కూడా కేంద్రానికి వివరించామని బుగ్గన చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3 వేల కోట్లు కూడా అడిగామని వెల్లడించారు.