ప్రపంచవ్యాప్తంగా 5 వేలు దాటిన కరోనా మరణాలు
- కరోనాతో 5,043 మంది మరణించారన్న ఏఎఫ్ పీ మీడియా సంస్థ
- కరోనా బారిన 121 దేశాలు
- 1.34 లక్షల మందికి కరోనా
చైనా ప్రధాన భూభాగంలో 3,176 మంది మృత్యువాత పడగా, ఇటలీలో 1,016 మంది చనిపోయారు. ఇరాన్ లోనూ 514 మంది ఈ మహమ్మారికి బలైనట్టు గుర్తించారు. కరోనా మొట్టమొదటిగా గత డిసెంబరులో వెల్లడైంది. మొత్తం 121 దేశాలు కరోనా బారినపడగా, 1,34,300 మందికి ఈ ప్రాణాంతక వైరస్ సోకినట్టు తెలిసింది.