ఆ బోర్డులో సుప్రీంకోర్టు న్యాయవాదిని చేర్చడంతోనే జగన్ అంతరంగం ఏమిటో అర్థమైంది: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

BJP MLC Madhav fires on Jagan
  • మాన్సాస్ భూములను దోచుకోవడానికి జగన్ కుట్ర పన్నారు
  • రాత్రికి రాత్రి అక్రమ జీవోలు జారీ చేశారు
  • ఆ భూముల విలువ లక్షల కోట్ల రూపాయలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మాన్సాస్ భూములను దోచుకోవడానికే జగన్ కుట్రలకు తెరలేపారని చెప్పారు. విజయనగరం జిల్లాలో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ... ఆలయాలు, విద్యాసంస్థల నిర్వహణకు దివంగత పీవీ రాజు భూములను దానం చేశారని... ఇప్పుడు వాటి విలువ లక్షల కోట్ల రూపాయలని చెప్పారు. వాటిని కాజేయాలనే దురుద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం రాత్రికి రాత్రి అక్రమ జీవోలను జారీ చేసిందని మండిపడ్డారు. మాన్సాస్ బోర్డులో సుప్రీంకోర్టు న్యాయవాదిని చేర్చడంతోనే జగన్ అంతరంగం ఏమిటో అర్థమైందని దుయ్యబట్టారు.
Go Back to Shorts
Madhav
BJP
Jagan
YSRCP
MANSAS

More Telugu News