ఏపీలో ఆపరేషన్ 'సురా'... 700 మందికిపైగా అరెస్ట్!
- సంపూర్ణ మద్య నిషేధం దిశగా ఏపీ
- డీజీపీ నుంచి స్పష్టమైన ఆదేశాలు
- 759 ప్రాంతాల్లో దాడులు చేసిన 10 వేల మంది సిబ్బంది
ఒకేసారి దాదాపు 10 వేల మంది సిబ్బంది 759 ప్రాంతాల్లో ఈ దాడుల్లో పాల్గొన్నారు. దాడుల్లో 4627 లీటర్ల సారాను, సుమారు 2312 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, అనుమతిలేని 24 వాహనాలను సీజ్ చేశామని, 702 మందిని అరెస్టు చేసి, మొత్తం 683 కేసులు నమోదు చేశామని ఉన్నతాధికారులు వెల్లడించారు.