Vijay Sai Reddy: అదే నీకూ జగన్ గారికి తేడా: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు

vijaya sai reddy fires on chandra babu naidu
షార్ట్స్‌లో చూడండి
త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి వైసీపీ అభ్యర్థులుగా ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణతో పాటు మరో ఇద్దరిని సీఎం జగన్‌ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.  

'విశ్వసనీయత అనే మాట బాబుకు అస్సలు నచ్చదు. నమ్మిన వాళ్లను తొక్కేయడంలో దిట్ట. మోపిదేవి, బోస్ ల పార్టీ విధేయతను గుర్తించి సీఎం జగన్ గారు ఏ స్థాయిలో గౌరవిస్తున్నారో చూస్తున్నావు కదా. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎందరికి టికెట్లిచ్చావు? అదే నీకూ జగన్ గారికి తేడా' అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News