తిరుమలలో స్వామి దర్శనానికి నాలుగు గంటల సమయం!

Normal Rush in Tirumala
  • 3 కంపార్ట్ మెంట్లలో వేచివున్న భక్తులు
  • నిన్న స్వామిని దర్శించుకున్న 61 వేలమంది
  • హుండీ ఆదాయం రూ. 3.49 కోట్లు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సర్వదర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ టోకెన్లు, నడకదారి భక్తుల దివ్య దర్శనం, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోందని పేర్కొన్నారు. నిన్న శ్రీవారిని 61,045 మంది భక్తులు దర్శించుకోగా, 20,844 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.49 కోట్ల ఆదాయం లభించింది.
Go Back to Shorts
Tirumala
Tirupati
TTD
Piligrims

More Telugu News