సద్గురు జగ్గీ వాసుదేవ్ తో డివిలియర్స్ ముచ్చట్లు
- ఈ నెల చివరి వారంలో ఐపీఎల్ ఆరంభం
- భారత్ చేరుకున్న ఏబీ డివిలియర్స్
- విజయం సాధించేందుకు ఏబీకి సూచనలు చేసిన సద్గురు
దీనిపై డివిలియర్స్ స్పందిస్తూ, భారత్ లో ఓ అద్భుతమైన వ్యక్తితో మాట్లాడానని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా గురించి, ఆఫ్రికా ఖండం గురించి అమోఘమైన సందేశం ఇచ్చారంటూ కొనియాడాడు. విజయం సాధించాలంటే ఏం చేయాలో చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ ఈ విధ్వంసక వీరుడు ట్వీట్ చేశాడు. అంతేకాదు తమ దేశం రావాలంటూ సద్గురుకు ఆహ్వానం పలకగా, ఆఫ్రికా వచ్చేందుకు తాను కూడా ఎదురుచూస్తున్నానని సద్గురు స్పందించారు.