ఫైనల్లో చేతులెత్తేసిన టీమిండియా టాపార్డర్... మిగిలినవాళ్లపైనే భారం!
- వరల్డ్ కప్ ఫైనల్లో కష్టాల్లో భారత్
- 185 పరుగుల చేజింగ్ లో 58 పరుగులకే 5 వికెట్లు డౌన్
- విఫలమైన షెఫాలీ, స్మృతి, హర్మన్ ప్రీత్
కెప్టెన్ హర్మన్ ప్రీత్ తన పేలవ ఫామ కొనసాగిస్తూ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జొనాస్సెన్ బౌలింగ్ లో వెనుదిరిగింది. వేగంగా ఆడే జెమీమా రోడ్రిగ్స్ (0) డకౌట్ కావడంతో టీమిండియా అవకాశాలను దెబ్బకొట్టింది. వికెట్ కీపర్ తాన్య రిటైర్డ్ హర్ట్ కాగా, వేదా 19 పరుగులు చేసి ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగింది. ప్రస్తుతం టీమిండియా మహిళల స్కోరు 13 ఓవర్లలో 5 వికెట్లకు 67 పరుగులు. దీప్తి శర్మ (17), రిచా ఘోష్ (7) క్రీజులో ఉన్నారు. భారత్ విజయం సాధించాలంటే ఇంకా 42 బంతుల్లో 118 పరుగులు చేయాలి.