మారుతీరావు ఆత్మహత్య గురించి టీవీలో చూశానన్న అమృత.. వీలునామా రాశారా? అన్న విషయం తెలియదన్న సోదరుడు

amritha about maruti rao suicide
  • నాన్నతో నేను మాట్లాడడం లేదన్న అమృత
  • పశ్చాత్తాపపడే ఆత్మహత్య చేసుకున్నాడేమోనని వ్యాఖ్య
  • నా సోదరుడితో ఎలాంటి విభేదాలు లేవన్న శ్రవణ్
  • ఊహాగానాలు రాయొద్దని మీడియాకు విజ్ఞప్తి
ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయన కూతురు అమృత మరోసారి స్పందించింది. తన తండ్రి ఆత్మహత్య గురించి  టీవీలో చూసే తెలుసుకున్నామని చెప్పింది. తన భర్త ప్రణయ్‌ హత్య జరిగిన తర్వాతి నుంచి మారుతీరావుతో మాట్లాడడం లేదని తెలిపింది. ప్రణయ్‌ను హత్య చేయించినందుకు పశ్చాత్తాపపడే మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడేమోనని చెప్పింది.

వీలునామా రాశారా? అన్న విషయం తెలీదు: సోదరుడు
కాగా, మారుతీరావు ఆత్మహత్యపై ఆయన సోదరుడు శ్రవణ్‌ మీడియాతో మాట్లాడారు. తన సోదరుడికి, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అయితే, విభేదాలు ఉన్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. గత ఏడాది మే 15న చివరిసారిగా తన అన్నతో మాట్లాడానని తెలిపారు.  లాయర్‌ను మాట్లాడుకోవడానికి కూడా మారుతీరావుకి సమయం లేకపోవడంతోనే ఒత్తిడికి గురయి ఉండొచ్చని చెప్పారు. ప్రణయ్‌ హత్య కేసు నేపథ్యంలో అనవసరంగా తాను ఈ కేసులో ఇరుక్కున్నాననే ఆయనతో మాట్లాడటం లేదని చెప్పారు. తన కుటుంబం ఇబ్బందుల పాలైందన్న కోపంతోనే తాను ఆయనతో మాట్లాడటం లేదని చెప్పారు. ఈ విషయంపై మీడియాలో ఊహాగానాలు రాయొద్దని విజ్ఞప్తి చేశారు. మారుతీరావు ఆస్తికి సంబంధించిన వీలునామా రాశారా? అన్న విషయం తనకు తెలియదని చెప్పారు.
Go Back to Shorts
amrita
maruti rao
Hyderabad

More Telugu News