రంగారెడ్డి జిల్లాలో దారుణం.. కారులోనే మహిళపై అఘాయిత్యం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రంగారెడ్డి జిల్లాలో దారుణం.. కారులోనే మహిళపై అఘాయిత్యం

Woman raped in Car in Rangareddy dist
  • షాబాద్ మండలంలో ఘటన
  • ఊర్లో దిగబెడతానని కారు ఎక్కించుకుని అత్యాచారం
  • నిందితుడి కోసం పోలీసుల గాలింపు
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. లిఫ్ట్ పేరుతో ఓ మహిళపై కారులోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడో వ్యక్తి. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. వారి కథనం ప్రకారం.. చందనవళ్లి గ్రామానికి చెందిన ఓ మహిళ పొరుగూరికి వెళ్లి తిరిగి వస్తూ దారిలో ఆటో కోసం వేచి చూస్తోంది. అదే సమయంలో కారులో ఆటువైపు వచ్చిన అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ ఆమెను చూసి కారు ఆపాడు. ఊర్లో దింపుతానని ఆమెను ఎక్కించుకుని బయలుదేరాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత దారి మళ్లించి కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధిత మహిళ నిన్న షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Ranga Reddy District
Shabad
woman
Rape
Crime News

More Telugu News