సాంకేతిక సమస్యలతో.. షాద్‌నగర్‌లో నిలిచిపోయిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌

Venkatadri stopped at Shadnagar due to technical problem
  • నానా పాట్లు పడుతున్న ప్రయాణికులు
  • ఉదయం ఆరు గంటలకు కాచిగూడ రావాలి
  • పన్నెండున్నర దాటుతున్నా ఇంకా అక్కడే
సాంకేతిక లోపం కారణంగా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ షాద్‌నగర్‌లో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పాట్లు వర్ణనాతీతం. చిత్తూరు నుంచి కాచిగూడకు వెళ్లాల్సిన రైలును అధికారులు షాద్‌నగర్‌లో నిలిపివేశారు. దీంతో ఉదయం 6 గంటలకు కాచిగూడ చేరాల్సిన రైలు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలు దాటినా ఇంకా అక్కడే ఉంది. సాంకేతిక సమస్య పరిష్కారానికి రైల్వే సిబ్బంది ప్రయత్నిస్తున్నారని, సమస్య పరిష్కారం కాగానే రైలు బయలుదేరుతుందని అధికారులు చెప్పి చేతులు దులిపేసుకున్నారు.
Go Back to Shorts
Venkatadri express
shadnagar
chittoor-kachiguda

More Telugu News