పోలీస్ స్టేషన్ పై నుంచి దూకిన మాజీ సర్పంచ్ అవినాశ్

Former surpanch jumps from police station
  • శివాలయం విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం
  • పోలీస్ స్టేషన్ కు చేరిన వివాదం
  • శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ పై నుంచి దూకిన అవినాశ్ చౌదరి
శ్రీకాకుళం జిల్లా షేర్ మహమ్మదాపురం మాజీ సర్పంచ్ అవినాశ్ చౌదరి ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ పై నుంచి కిందకు దూకారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల మధ్య వివాదం నేపథ్యంలో ఆయన మనస్తాపానికి గురయ్యారు. షేర్ మహమ్మదాపురంలోని శివాలయం విషయంలో ఇరు వర్గాల మధ్య ఈ వివాదం తలెత్తింది. ఈ వివాదం కాస్తా పోలీస్ స్టేషన్ వరకు చేరింది. ఈ క్రమంలో ఆయన పోలీస్ స్టేషన్ పైకి ఎక్కారు. ఆయనను అడ్డుకోవడానికి ఒక వ్యక్తి రాగా... వెంటనే ఆయన పై నుంచి దూకేశారు.
Go Back to Shorts
Avinash Chowdary
Ex Surpanch
Srikakulam District
Police Station
Jump

More Telugu News