ఏపీలో ఐపీఎస్‌ అధికారుల బదిలీలు

  • పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌గా హరీశ్‌ కుమార్‌ గుప్తా
  • విశాఖపట్నం అదనపు డీజీగా ఆర్‌కే మీనా 
  • డీజీపీ కార్యాలయంలో న్యాయ విభాగం ఐజీగా బి.హరికుమార్
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీచేసింది. వీరి బదిలీలు వెంటనే అమల్లోకి వస్తాయి. పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌గా హరీశ్‌ కుమార్‌ గుప్తా, విశాఖపట్నం అదనపు డీజీగా ఆర్‌కే మీనాకు పదోన్నతి లభించింది.

డీజీపీ కార్యాలయంలో న్యాయ విభాగం ఐజీగా బి.హరికుమార్‌కు పోస్టింగ్‌ దక్కింది. ఎస్‌ఐబీ ఐజీగా సీహెచ్‌ శ్రీకాంత్‌ నియమితులయ్యారు. మెరైన్ విభాగం ఐజీగా ఏఎస్‌ఖాన్‌, గుంటూరు రేంజ్‌ ఐజీగా జె.ప్రభాకర్‌రావు బదిలీ అయ్యారు. డైరెక్టర్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌ ఐజీతో పాటు ఎక్సైజ్‌, ప్రొహెబిషన్‌ డైరెక్టర్‌గా వినీత్‌ బ్రిజ్‌లాల్‌కు అదనపు బాధ్యతలు దక్కాయి. 


More Telugu News