మహిళలు స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ.. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత
- హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఘటన
- ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం లోంచి వీడియోల చిత్రీకరణ
- బాధిత మహిళ చూడడంతో బాగోతం వెలుగులోకి
ఓ ప్రైవేటు సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఫణీందర్ తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోని మహిళలు స్నానాలు చేస్తుండగా వీడియో తీయడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. వారు బాత్రూంలోనికి వెళ్లినప్పుడు బాల్కనీ రెయిలింగ్ ఎక్కి ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలోంచి సెల్‌ఫోన్ ద్వారా వీడియోలు తీసేవాడు. రెండు రోజుల క్రితం కూడా ఇలాగా వీడియో తీస్తుండగా గమనించిన బాధిత మహిళ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. అప్రమత్తమైన వారు నిందితుడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అతడి నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.