Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహిళలు స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ.. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత

Man shooting videos while women bathing
  • హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఘటన
  • ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం లోంచి వీడియోల చిత్రీకరణ
  • బాధిత మహిళ చూడడంతో బాగోతం వెలుగులోకి
మహిళలు స్నానాలు చేస్తుండగా సెల్‌ఫోన్ ద్వారా వీడియోలు చిత్రీకరిస్తున్న వ్యక్తిని స్థానికులు చితకబాదారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో జరిగిందీ ఘటన. ఖమ్మం పట్టణానికి చెందిన ఫణీందర్ (30) కొండాపూర్‌లోని మసీద్‌బండ ప్రాంతంలో భార్యతో కలిసి నివసిస్తున్నాడు.

ఓ ప్రైవేటు సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఫణీందర్ తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోని మహిళలు స్నానాలు చేస్తుండగా వీడియో తీయడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. వారు బాత్రూంలోనికి వెళ్లినప్పుడు బాల్కనీ రెయిలింగ్ ఎక్కి ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలోంచి సెల్‌ఫోన్ ద్వారా వీడియోలు తీసేవాడు. రెండు రోజుల క్రితం కూడా ఇలాగా వీడియో తీస్తుండగా గమనించిన బాధిత మహిళ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. అప్రమత్తమైన వారు నిందితుడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అతడి నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Kondapur
video shooting
Crime News

More Telugu News