'లవ్ స్టోరీ' విడుదల తేదీ దాదాపు ఖరారైనట్టే
- శేఖర్ కమ్ముల నుంచి మరో ప్రేమకథ
- చైతూ జోడిగా సాయిపల్లవి
- మే 29న విడుదల చేసే ఆలోచన
'లవ్ స్టోరీ' దర్శక నిర్మాతలు మాత్రం రెండు డేట్లు పరిశీలిస్తున్నారట. మే 9వ తేదీ .. మే 29వ తేదీ. ఈ రెండు తేదీలలో ఏ రోజునైతే బాగుంటుందనే విషయంలో తర్జన భర్జనలు జరిగిన తరువాత, మే 29వ తేదీన విడుదల చేయడమే అన్ని విధాలా మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. 'ఫిదా' తరువాత శేఖర్ కమ్ముల - సాయిపల్లవి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమా పట్ల అందరిలోను ఆసక్తి వుంది.