ఇకపై స్వర్ణకారుల ఆత్మహత్యలు ఉండకూడదు: నారా లోకేశ్
- మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నా
- ఆపై లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీని ప్రారంభించా
- ఈ సొసైటీ ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలను అందిస్తాం
ఇకపై స్వర్ణకారుల ఆత్మహత్యలు ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఈ సంఘాన్ని ప్రారంభించానని, వారు తమ వృత్తిని కొనసాగించే విధంగా పని ప్రదేశాల్లో మెరుగైన వసతులు కల్పిస్తామని అన్నారు. గోల్డ్ బిస్కెట్స్, ఉచిత వైద్యం సహాయం, బీమా, వారి పిల్లల చదువుకి సాయం వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను ఈ సొసైటీ ద్వారా అందించనున్నట్టు లోకేశ్ వివరించారు.