అది తెలుగుదేశం పార్టీ ఆఫీసా? లోకేశ్ వైన్ షాపా?: బోండాకు రోజా ఘాటు కౌంటర్
- అధికారం కోల్పోయిన టీడీపీ నాయకులకు పిచ్చెక్కింది
- ఇంగితజ్ఙానం లేని విధంగా బోండా ఉమ ప్రెస్ మీట్ ఉంది
- లిక్కర్ బాటిల్స్ తో కూర్చున్న బోండా ఓ సేల్స్ మెన్ లా ఉన్నారు
టీడీపీ కార్యాలయంలో లిక్కర్ బ్రాండ్స్ ను తన ముందు పెట్టుకుని కూర్చున్న బోండా ఉమ.. వైన్ షాపులోనో, బార్ లోనో ఓ సేల్స్ మెన్ లా ఉన్నారని, ‘అది తెలుగుదేశం పార్టీ ఆఫీసా? లోకేశ్ వైన్ షాపా? అది పార్టీ ఆఫీసా? చంద్రన్న బెల్టు షాపా?’అనే అనుమానం తలెత్తుతోందని ఎద్దేవా చేశారు. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే కల్లు తాగిన కోతులు ఎలా వ్యవహరిస్తాయో టీడీపీ నేతలూ అలా వ్యవహరించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.