సెక్రటేరియట్ కు వెళ్లనున్న జగన్.. మందడంలో భారీగా మోహరించిన పోలీసులు
- సీఎం ప్రయాణానికి ఆటంకాలు ఎదురుకాకుండా పటిష్ట చర్యలు
- ప్రతి ఇంటి వద్ద నిలబడ్డ పోలీసులు
- పోలీసులతో రైతుల వాగ్వాదం
మందడంలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ప్రతి ఇంటి వద్ద పోలీసులు నిలబడ్డారు. రైతుల శిబిరం వద్ద ఎవరూ రోడ్డుపైకి రాకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కొత్త శిబిరంలో ఆందోళనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పాత శిబిరంలోనే నిరసనలు కొనసాగించాలని రైతులకు పోలీసులు సూచించారు. మరోవైపు, శాంతియుతంగా తాము చేస్తున్న నిరసన కార్యక్రమాలను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగుతున్నారు.