పెళ్లి చేసుకోవాలంటే సంబంధం కూడా దొరకదని చంద్రబాబు హేళన చేశాడు: విజయసాయిరెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి చేసుకోవాలంటే సంబంధం కూడా దొరకదని చంద్రబాబు హేళన చేశాడు: విజయసాయిరెడ్డి

vijaya sai reddy fires on chandra babu naidu
  • గ్రామ వాలంటీర్లెంత? అన్నాడు
  • వాళ్ల జీతాలెంత? అని విమర్శించాడు
  • ఆయన పుత్రరత్నం వాలంటీర్లలో ఒక్కరితో కూడా సరితూగలేడు
  • అప్పగించిన బాధ్యతను వాలంటీర్లు సైనికుల్లా నిర్వర్తిస్తున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. గ్రామ వాలంటీర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ట్వీట్ చేశారు.

'గ్రామ వాలంటీర్లెంత? వాళ్ల జీతాలెంత? పెళ్లి చేసుకోవాలంటే సంబంధం కూడా దొరకదని హేళన చేశాడు చంద్రబాబు. అప్రయోజకుడైన ఆయన పుత్రరత్నం నాలుగున్నర లక్షల మంది వాలంటీర్లలో ఒక్కరితో కూడా సరితూగలేడు. సీఎం జగన్ గారు అప్పగించిన బాధ్యతను సైనికుల్లా నిర్వర్తిస్తున్నారు. హాట్సాఫ్' అంటూ విజయసాయిరెడ్డి ఓ ఫొటోను పోస్ట్ చేశారు.


Vijay Sai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News