తన సాంగ్ ను తానే రీమిక్స్ చేయించుకోనున్న బాలకృష్ణ... బోయపాటికి ఆదేశం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన సాంగ్ ను తానే రీమిక్స్ చేయించుకోనున్న బాలకృష్ణ... బోయపాటికి ఆదేశం!

Balakrishna want to remix his own song
  • దాదాపు పాతికేళ్ల క్రితం వచ్చిన 'బంగారు బుల్లోడు'
  • రవీనాతో కలిసి 'స్వాతిలో ముత్యమంత..' పాట
  • అదే పాట ఇప్పుడు అంజలితో కలిసి చేయనున్న బాలయ్య
బాలకృష్ణ చిత్రాల్లో అప్పుడప్పుడూ రిమిక్స్ పాటలు కనిపిస్తుంటాయి. 'పైసా వసూల్' సినిమా కోసం తన తండ్రి ఎన్టీఆర్ నటించిన 'జీవిత చక్రం' సినిమాలోని "కంటి చూపు చెబుతోంది, కొంటె నవ్వు చెబుతోంది..." అనే పాటను రీమిక్స్ చేయించిన బాలయ్య, ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో తన పాటనే రీమిక్స్ నేటి తరానికి, ట్రెండ్ కు అనుగుణంగా రీమిక్స్ చేయాలని చెప్పారట.

ఇంతకీ అదే పాటో తెలుసా? సూపర్ హిట్ సినిమా 'బంగారు బుల్లోడు'లోని  "స్వాతిలో ముత్యమంత ముద్దులా..." దాదాపు పాతికేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా, అప్పట్లో పెద్ద హిట్. ఇక ఈ సాంగ్ లో రవీనా టాండన్ తో కలిసి బాలయ్య వర్షంలో తడుస్తూ డ్యాన్స్ చేశారు. ఇప్పుడిక అదే పాటను బాలకృష్ణ, అంజలి మీద చిత్రీకరించేందుకు బోయపాటి ఏర్పాట్లు చేస్తున్నారట. కాగా, ఈ పాటను ఇప్పటికే అల్లరి నరేశ్ రీమిక్స్ చేయించాడు.
Balakrishna
Boyapati Sreenu
Remix
Bangaru Bullodu

More Telugu News