భారత పేస్ దాటికి న్యూజిలాండ్ కకావికలం... 150 పరుగులకే 7 వికెట్లు!
- 3 పరుగులకే అవుట్ అయిన విలియమ్సన్
- వాట్లింగ్, సౌథీ డక్కౌట్
- 3 వికెట్లు తీసిన జస్ ప్రీత్ బుమ్రా
భారత పేస్ బౌలర్లు జస్ ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీల ధాటికి మిడిలార్డర్ కుప్పకూలింది. టేలర్ 15 పరుగులకు, నికోలస్ 14 పరుగులకు అవుట్ కాగా, వాట్లింగ్, సౌథీలు డక్కౌట్ అయ్యారు. దీంతో ఆ జట్టు కీలక వికెట్లను అన్నింటినీ కోల్పోయింది. ప్రస్తుతం గ్రాండ్ హోమ్ 19 పరుగులతో క్రీజులో ఉండగా, అతనికి జెమీసన్ వచ్చి చేశారు.
ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 52 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు. భారత బౌలర్లలో బుమ్రాకు 3, షమీకి 2 వికెట్లు లభించగా, ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజాలు చెరో వికెట్ ను పడగొట్టారు.