వైసీపీ నాయకులే చెప్పులు, కోడిగుడ్లు సరఫరా చేయడం దారుణం: అశోక్ గజపతిరాజు

  • చంద్రబాబును అడ్డుకోవడాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి
  • ప్రజల వద్దకు ప్రతిపక్ష నాయకుడిని వెళ్లకుండా చేయడం ఎంతవరకు సబబు?
  • ఏపీని ముక్కలు చేయాలనే ఆలోచన మంచిది కాదు
విశాఖ ఎయిర్ పోర్టు వద్ద టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంపై పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు మండిపడ్డారు. అక్రమాలు ఎక్కడ జరిగినా అక్కడకు వెళ్లి చూడాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతకు ఉందని ఆయన అన్నారు. ప్రజల వద్దకు ప్రతిపక్ష నాయకుడిని వెళ్లకుండా చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. చంద్రబాబును అడ్డుకోమని రాష్ట్ర మంత్రులే చెప్పడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని చెప్పారు. ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబును అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామని అన్నారు.

వైసీపీ నాయకులే చెప్పులు, కోడిగుడ్లు సరఫరా చేయడం దారుణమని అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేసిన త్యాగాలను అవమానించవద్దని చెప్పారు. ఏపీని ముక్కలు చేయాలనే ఆలోచన మంచిది కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబును అడ్డుకోవడాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని విన్నవించారు.

Ashok Gajapathi Raju
Chandrababu
Telugudesam
Vizag
Airport
YSRCP

More Telugu News