పవన్ సరసన మళ్లీ ఛాన్స్ దక్కించుకున్న కీర్తి సురేశ్
- చారిత్రక నేపథ్యంలో 'విరూపాక్ష'
- బందిపోటు దొంగగా పవన్ కల్యాణ్
- అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి
చారిత్రక నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. కీర్తి సురేశ్ గతంలో పవన్ సరసన 'అజ్ఞాతవాసి' చేసింది. అయితే ఆ సినిమా అంతగా ఆడకపోవడం వలన, ఈ కాంబినేషన్ జనానికి ఎక్కలేదు. పవన్ రీ ఎంట్రీ వేళలో మళ్లీ కీర్తి సురేశ్ ను వెతుకుతూ అవకాశం వెళ్లడం ఆమె అదృష్టమే. ఈ సారి ఈ జోడీ తెరపై ఒక రేంజ్ లో సందడి చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. బందిపోటు దొంగగా పవన్ కనిపించనున్న ఈ సినిమాకి, 'విరూపాక్ష' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.