సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'హిట్'
- కొత్త దర్శకుడి నుంచి 'హిట్'
- కథానాయికగా రుహానీ శర్మ
- సెన్సార్ బోర్డు నుంచి యు/ఎ సర్టిఫికెట్
ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ కి .. టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వెళుతున్నాయి. రుహాని శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఎల్లుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తనకి తప్పకుండా విజయాన్ని తెచ్చిపెడుతుందనే నమ్మకంతో విష్వక్సేన్ వున్నాడు. ఇక ఈ సినిమా తన కెరియర్ కి తప్పకుండా హెల్ప్ అవుతుందనే నమ్మకంతో రుహాని శర్మ వుంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.