రాజకీయాలకు దూరంగా ఉంటున్నా.. దానిపై స్పందించలేను: వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు
- దేవినేని ఆరోపణలను ఖండించిన వసంత
- మూడు రాజధానులు ఇష్టం లేదని జగన్‌కు నిబ్బరంగా చెప్పేశాం
- దేవినేనివి దిగజారుడు ఆరోపణలు
మూడు రాజధానుల ప్రతిపాదన తనకు, తమ ప్రాంత ప్రజలకు ఇష్టం లేదని తన కుమారుడు కృష్ణప్రసాద్ సీఎం జగన్ వద్ద నిర్భయంగా చెప్పేశాడని గుర్తు చేశారు. అమరావతిలో ఎంపీ నందిగం సురేశ్‌పై దాడి ఘటనలో తామే కేసులు పెట్టించామంటూ దేవినేని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. శుభకార్యాలకు తమను పిలవొద్దని ఉమ పిలుపునివ్వడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని వసంత ఆగ్రహం వ్యక్తం చేశారు.