యూఎస్ లో దుమ్ము రేపేస్తున్న 'భీష్మ'

Bheeshma movie
  • తెలుగు రాష్ట్రాల్లో భారీగా 'భీష్మ' వసూళ్లు
  • యూఎస్ లోను అదే జోరు
  • 'అ ఆ' తరువాత నితిన్ కి పెద్ద హిట్
నితిన్ ప్రేమకథతోనే తన కెరియర్ ను మొదలుపెట్టాడు .. ఎన్నో ప్రేమకథా చిత్రాలను చేశాడు. ఈ సారి ఆయన నుంచి ప్రేమకథగా వచ్చిన 'భీష్మ' మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో నితిన్ మరింత ఫ్రెష్ గా కనిపించడమే కాకుండా, డిఫరెంట్ కంటెంట్ తో ఆకట్టుకున్నాడు. దాంతో ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తూ వెళుతోంది. తెలుగు రాష్ట్రాలలోనే కాదు యూఎస్ లోను తన జోరు చూపుతోంది.

ఇటీవల యూఎస్ లో విడుదలైన 'జాను'.. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలు రెండూ ప్రేమకథ నేపథ్యంలో సాగినవే. అయితే ఆ రెండు సినిమాలను కూడా యూఎస్ ఆడియన్స్ పట్టించుకోలేదు. దాంతో అక్కడ ఆ  రెండు సినిమాలు వసూళ్లపరంగా పూర్తిగా నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో వచ్చిన 'భీష్మ' పరిస్థితి ఎలా వుంటుందా అని అంతా అనుకున్నారు. అయితే 'భీష్మ' యూఎస్ లోను విజయవిహారం చేస్తోంది. నిన్నటి నుంచే ఈ సినిమా అక్కడ లాభాల బాట పట్టింది. 'అ ఆ' తరువాత అక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా 'భీష్మ' నిలిచే అవకాశాలు ఎక్కువనే టాక్ బలంగా వినిపిస్తోంది.
Go Back to Shorts
Nithin
rashmika
Venky Kudumula Bheeshma Movie

More Telugu News