అజిత్ దోవల్ పేరిట నకిలీ ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ
- టీటీడీ నిధులు రాష్ట్ర ఖజానాకు మళ్లిస్తున్నారంటూ ప్రచారం
- తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీటీడీ వర్గాలు
- తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
- ఇలాంటి ప్రచారం దారుణమన్న వైవీ సుబ్బారెడ్డి
ఈ వ్యవహారంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. దేవుడి సొమ్మును ఇష్టం వచ్చినట్టు వాడడానికి లేదని, భక్తుల కోసం మాత్రమే ఆ సొమ్ము వినియోగించాల్సి ఉంటుందని అన్నారు. ఇలాంటి వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. టీటీడీ వ్యవహారాల కోసం త్వరలోనే సైబర్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.