థాకరేకు ఎస్పీ నేత అబు అజ్మీ హెచ్చరిక
- సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి
- మహారాష్ట్రలో ఎన్పీఆర్ ను చేపడితే మేము వ్యతిరేకిస్తాం
- అందుకే ముందుగానే విన్నవిస్తున్నాం
మరోవైపు శివసేన తీరును కాంగ్రెస్ పార్టీ కూడా తప్పుబడుతోంది. కాంగ్రెస్ నేత మనీశ్ తివారి మాట్లాడుతూ... సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీల మధ్య ఉన్న లింకును థాకరే అర్థం చేసుకోవాలని కోరారు. ఒక్కసారి ఎన్పీఆర్ పూర్తయితే... ఎన్నార్సీని అడ్డుకోవడం సాధ్యమయ్యే పని కాదని ఆయన అన్నారు.
ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే నిన్న భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహారాష్ట్రలో సీఏఏ, ఎన్పీఆర్ లను అమలు చేయాలని వారిని థాకరే కోరారు. ఈ నేపథ్యంలోనే, సంకీర్ణ ప్రభుత్వంలోని మిత్రులు కూడా థాకరే పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.