అమ్మాయిల జట్టుకు సచిన్, సెహ్వాగ్ అభినందనలు
- టి20 వరల్డ్ కప్ లో భారత్ మహిళల జట్టు శుభారంభం
- ఆసీస్ పై 17 పరుగుల తేడాతో విజయం
- తిరుగులేని విజయం సాధించారంటూ సచిన్ ప్రశంసలు
- అమ్మాయిలు అదరగొట్టారన్న సెహ్వాగ్
టి20 వరల్డ్ కప్ ను తిరుగులేని విజయంతో ప్రారంభించారని సచిన్ కొనియాడారు. అన్ని రంగాల్లో రాణించి, సత్తా చాటారని అభినందించారు. "కంగ్రాచ్యులేషన్స్, మీరు ఇకముందు కూడా ఇలాగే ఆడతారని ఆశిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు. ఇక సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించారు. "ఆహా ఏం విజయం! అమ్మాయిలూ అదరగొట్టారు. 132 పరుగుల స్కోరును కాపాడుకుంటూ ఆస్ట్రేలియాను కుప్పకూల్చడం సామాన్యమైన విషయం కాదు. కంగ్రాచ్యులేషన్స్!" అంటూ వ్యాఖ్యానించారు.