Viral Videos: 'ఇద్దరి లోకం ఒకటేలే నాన్నా .. నా కళ్లతో ఈ మ్యాచ్‌ చూడు'.. కళ్లు లేని కొడుకుని మైదానానికి తీసుకొచ్చిన తండ్రి

  • కొలంబియాలో ఘటన
  • కుమారుడికి ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూపిన తండ్రి
  • సర్వత్రా ప్రశంసల జల్లు
video of a father describing a football match to his blind son

'నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా' అంటూ కళ్లు లేని తన స్నేహితురాలికి ఓ సినిమాలో హీరో జగపతి బాబు ప్రకృతిలోని అందాలను చూపిస్తాడు. అచ్చం ఇలాగే కళ్లు లేని తన కుమారుడికి ఓ తండ్రి ప్రపంచాన్ని చూపెడుతున్నాడు.

తాజాగా, తన కుమారుడిని మైదానానికి తీసుకొచ్చి ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూపించాడు. తన ఇష్టమైన జట్టు మైదానంలో ఆడుతుంటే గ్యాలరీలో కూర్చుని ప్రత్యక్షంగా చూడాలని ఆశపడుతున్న కుమారుడి కోరికను ఆ తండ్రి తీర్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. మ్యాచ్‌లో ఏం జరుగుతుందో ఆ తండ్రి కుమారుడికి వివరించి చెప్పాడు. ఆ బాలుడు పుట్టుకతోనే అంధుడు.

టీవీ ముందు కూర్చుని కూడా మ్యాచ్‌ను చూస్తున్న సమయంలో ఆ తండ్రి మ్యాచ్‌లో ఏం జరుగుతుందో చెబుతాడు. తాజాగా, కొలంబియాలోని ఓ మైదానానికి తీసుకొచ్చి మ్యాచ్‌ను చూపించాడు. మైదానంలో ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారో కుమారుడికి వివరించి చెప్పాడు. దీనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

More Telugu News