గుంటూరు జిల్లాలో పెళ్లికి వెళ్లొస్తూ ట్రాక్టర్​ బోల్తా.. నలుగురి మృతి

  • మరో ఐదుగురి పరిస్థితి సీరియస్
  • చుండూరు మండలం చింతపల్లి సమీపంలో ఘటన
  • ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 50 మంది
గుంటూరు జిల్లా చింతపల్లి సమీపంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. బంధువుల పెళ్లికి వెళ్లొస్తున్న వారి ట్రాక్టర్ బోల్తా పడటంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పెళ్లికి వెళ్లి తిరిగొస్తుండగా, మరికొన్ని నిమిషాల్లో తిరిగి ఊరికి చేరుకుంటామనగా ఈ ప్రమాదం జరిగింది.

ట్రాక్టర్ లో 50 మంది

గుంటూరు జిల్లా చుండూరు మండలం మాలపల్లి నుంచి 50 మంది కలిసి ట్రాక్టర్ లో తెనాలిలో జరిగిన పెళ్లికి వెళ్లారు. పెళ్లి అయిపోయాక తిరుగు ప్రయాణమయ్యారు. మార్గంలోని చింతపల్లి గ్రామ సమీపంలోని అంబేద్కర్ నగర్ వద్ద మలుపు తిరుగుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రమాదంతో అందరూ కేకలు వేయడంతో.. సమీపంలోని పొలాల్లో ఉన్నవాళ్లు, రోడ్డుపై వెళ్తున్నవారు ఆగి సహాయం చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతా కలిసి గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో చాలా మంది మహిళలు, పిల్లలేనని అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Road Accident
Guntur District
Andhra Pradesh
Tractor Accident

More Telugu News