అజిత్ షూటింగులో ప్రమాదం... స్వల్ప గాయాలు!
- 'వలిమై' షూటింగ్ లో ప్రమాదం
- బైక్ చేజింగ్ సీన్ లో స్కిడ్ అయిన బైక్
- కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు
'ఖాకి' దర్శకుడు హెచ్ వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఓ బైక్ ఛేజింగ్ సీన్ ను చిత్రీకరిస్తున్న వేళ, బైక్ స్కిడ్ కావడంతో అజిత్ కు స్వల్పంగా దెబ్బలు తగిలాయని తెలుస్తోంది. ఆపై, కాసేపు విశ్రాంతి తీసుకున్న అజిత్, ఆ షాట్ ను పూర్తి చేసిన తరువాత ఆసుపత్రికి వెళ్లగా, కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారని చిత్ర యూనిట్ వెల్లడించింది. కాగా, ఈ సినిమా తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగనుంది. ఈ సినిమాను నాలుగు భాషల్లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తుండటంతో పలు ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు.