యూపీ బీజేపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ త్రిపాఠిపై రేప్ కేసు నమోదు
- మహిళను బంధించి నెల రోజులపాటు అత్యాచారం
- ఎమ్మెల్యే సహా ఏడుగురిపై కేసు నమోదు
- బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన పోలీసులు
2017లో తనను బంధించి నెల రోజులపాటు ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తాను గర్భం దాల్చడంతో బలవంతంగా అబార్షన్ చేయించారని ఆరోపించింది. ఈ నెల 10నే ఆమె ఫిర్యాదు చేసినట్టు ఎస్పీ రామ్ బదన్‌సింగ్ తెలిపారు. ఆమె ఫిర్యాదుతో ఎమ్మెల్యే సహా ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు చెప్పిన ఎస్పీ.. బాధిత మహిళ స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్టు తెలిపారు.