మియాపూర్‌లో కారు బీభత్సం.. వాహనాలను ఢీకొట్టి పాన్‌షాప్‌లోకి దూరిన వైనం!

Car accident in Miyapur
  • బెంబేలెత్తిన వాహనదారులు
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన స్థానికులు
  • పోలీసుల అదుపులో డ్రైవర్
హైదరాబాద్ శివారులోని మియాపూర్‌లో ఈ ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తూ అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. అదే వేగంతో ముందుకు వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న పాన్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు వాహనదారులు గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో వాహనదారులు బెంబేలెత్తిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును షాపు నుంచి బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  
Go Back to Shorts
Road Accident
Hyderabad
Miyapur

More Telugu News