వెట్టిచాకిరీ నిర్మూలన చట్టం 1976లోనే వచ్చినా ప్యాకేజి స్టార్ బయటపడలేకపోతున్నాడు: విజయసాయి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తనదైన శైలిలో వ్యంగ్యం కురిపిస్తూ ట్వీట్ చేశారు. ఈసారి జనసేనాని పవన్ కల్యాణ్ ను పరోక్షంగా లక్ష్యంగా చేసుకున్నారు. వెట్టిచాకిరి నిర్మూలన చట్టం 1976లోనే వచ్చినా ప్యాకేజీ స్టార్ లాంటి వాళ్లు బానిస సంకెళ్ల నుంచి బయటపడలేకపోతున్నారని సెటైర్ వేశారు. జనం నవ్వుకుంటారన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా యజమానిని సమర్థిస్తున్నాడంటూ వ్యాఖ్యానించారు. 'పీఎస్' శ్రీనివాస్ అవినీతిని ప్రశ్నించే నైతిక హక్కు ఎవరికీ లేదంటున్నాడని, విధేయతలో కట్టప్పను మించిపోయాడని ఎద్దేవా చేశారు.


More Telugu News