మీ విడాకులకు హీరో ధనుష్ కారణమా? అన్న ప్రశ్నకు హీరోయిన్‌ అమలాపాల్‌ ఘాటు సమాధానం

  • రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్న అమలాపాల్‌, దర్శకుడు విజయ్‌ 
  • ధనుష్ వల్లే విడాకులంటూ విజయ్ తండ్రి వ్యాఖ్యలు
  • పూర్తిగా తన సొంత నిర్ణయమేనని స్పష్టత
ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న హీరోయిన్ అమలాపాల్‌, దర్శకుడు విజయ్‌ అనంతరం విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తాజగా విజయ్‌ తండ్రి, నిర్మాత ఏఎల్‌.అళగప్పన్‌ చేసిన వ్యాఖ్యలు అమలాపాల్‌కు కోపం తెప్పించాయి.

 తన కుమారుడు విజయ్‌ విడాకులు తీసుకోవడానికి నటుడు ధనుష్ కారణం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తాను నిర్మించిన ‘అమ్మ కణక్కు’ చిత్రంలో నటించమని అమలాపాల్‌ను ఆయన కోరాడని చెప్పాడు. దీంతో, పెళ్లి జరిగాక నటించనని చెప్పిన అమలాపాల్‌ మళ్లీ నటించడానికి సిద్ధమైన నేపథ్యంలో అమలాపాల్‌, విజయ్‌కు మధ్య విభేదాలు వచ్చాయని తెలిపారు.

ఈ విషయంపై అమలాపాల్‌ను మీడియా ప్రశ్నించడంతో  ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ఎప్పుడో జరిగిన విషయంపై ఇప్పుడు అడుగుతున్నారేంటని ప్రశ్నించింది. విడాకులపై ఇప్పుడు చర్చ అనవసరమని తెలిపింది. విడాకులు తీసుకోవాలన్నది పూర్తిగా తన సొంత నిర్ణయమేనని తెలిపింది. అందుకు ఇతరులెవరూ బాధ్యులు కారని చెప్పింది. అసలు ఇతరుల కారణంగా ఎవరైనా వివాహాన్ని రద్దు చేసుకుంటారా? అని నిలదీసింది.  ఇక తాను మరో పెళ్లి చేసుకోవడానికి ఇంకా సమయం ఉందని చెప్పింది.

Amala Paul
cinema

More Telugu News