గుంటూరు జిల్లాలో... వివాహేతర సంబంధం పెట్టుకున్న సీఐపై వేటు

CI Venkatareddy Suspended for having Illegal Relationship with a woman
  • మహిళను వంచించి అక్రమ సంబంధం పెట్టుకున్న సీఐ వెంకటరెడ్డి
  • తనను మోసం చేశాడంటూ అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు 
  • వెంకటరెడ్డి తప్పు చేశాడని విచారణలో తేలిన వైనం
సమాజానికి ఆదర్శంగా నిలవాల్సింది పోయి... ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత ఆమెను మోసం చేసిన పోలీసు అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే, గుంటూరు జిల్లా నగరంపాలెం సీఐగా వెంకటరెడ్డి పని చేస్తున్నారు. అయితే, ఓ మహిళను వంచించి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఈ క్రమంలో వెంకటరెడ్డి తనను మోసం చేశారంటూ సదరు మహిళ అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ విషయం ఐజీ వరకు వెళ్లింది. దీంతో వెంకటరెడ్డిపై విచారణకు ఐజీ ఆదేశించారు. వెంకటరెడ్డి తప్పు చేసినట్టు విచారణలో తేలింది. దీంతో, ఆయనను సస్పెండ్ చేశారు.
Go Back to Shorts
CI Venkata Reddy
Guntur District
Suspention
Illegal Contact

More Telugu News