Telangana: పంజాగుట్ట జీవీకే మాల్‌ వద్ద తెలంగాణ మంత్రి పువ్వాడ కాన్వాయ్‌కి ప్రమాదం

telangana minister convoy accident
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌లోని పంజాగుట్ట సమీపంలోని జీవీకే మాల్‌ వద్ద తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. ఆ మార్గం మీదుగా ఆయన కాన్వాయ్ వెళ్తున్న సమయంలో దానికి బైకు అడ్డు వచ్చింది.

దాన్ని తప్పించబోయి కాన్వాయ్‌లోని ఓ వాహనం మరో వాహనం ఢీకొనడంతో బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు మరో మూడు వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే, అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. బేగంపేటలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్‌కు పువ్వాడ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆయన ఇతర వాహనంలో ప్రగతి భవన్‌ కు వెళ్లారు.
Go Back to Shorts
Telangana
TRS
Road Accident

More Telugu News