ఆ ఉద్దేశం ఉంటే ధైర్యంగా చెప్పండి: వైసీపీని సూటిగా ప్రశ్నించిన సీపీఐ రామకృష్ణ
- బీజేపీతో కలవాలనుకుంటే వెల్లడించండి
- ఈ విషయంలో దోబూచులాటలు ఎందుకు?
- మోదీ పాలన అంతా అంబానీలు, ఆదానీల కోసమే
ఢిల్లీ వెళ్లిన సీఎం గంటన్నరపాటు ప్రధాని మోదీతో ఏం మాట్లాడారని, ఏం అడిగారో ఆ విషయాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాల్లోకి వదిలేసిందన్నారు. ప్రస్తుతం వారి పని అంబానీలు, ఆదానీలు, బిర్లాల సేవకే సరిపోతోందని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్రకు నిధుల విషయంలో మోదీ మాట తప్పారని, ఆ విషయంలో ఏం చేశారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు.