CM Jagan: అయ్యా...జగన్‌గారూ సీఏఏకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్‌ వేయండి: టీడీపీ ఎంపీ కేశినేని

mr jagan please do against to CAA kesineni
  • సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ వల్ల అన్నివర్గాలకు ఇబ్బంది
  • అందువల్ల వీటికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయండి
  • అనంతరం కోర్టును ఆశ్రయించి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి
పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకమని అసెంబ్లీలో తీర్మానం చేసి, చట్టపరంగా దీనికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కోరుతున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని తెలిపారు. ఈ మేరకు కడపలో నిర్వహించిన సమావేశంలో తీర్మానించినట్లు ట్వీట్‌ చేశారు.

‘అయ్యా... జగన్‌గారూ, ఈ చట్టాల వల్ల ముస్లింలే కాదు అన్ని వర్గాల  ప్రజలు ఇబ్బందులు పడతారు. అందుకే వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి సుప్రీంకోర్టులో వీటిని వ్యతిరేకిస్తూ పిటిషన్‌ దాఖలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం’ అంటూ ట్విట్టర్‌లో తెలిపారు.
CM Jagan
Kesineni Nani
cuddapha

More Telugu News