చంద్రబాబు గారి హిస్టరీ ఏంటి? అంటూ అంబటి సెటైర్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబు గారి హిస్టరీ ఏంటి? అంటూ అంబటి సెటైర్లు

Ambati Rambabu ironies on chandrababu
  • డబ్బుతోనే  రాజకీయాలు చేస్తున్న వ్యక్తి చంద్రబాబు
  • మాజీ పీఎస్ పై ఐటీ దాడులతో చంద్రబాబు దొరికిపోయారు
  • బాబును కాపాడటం కోసం ఎల్లో మీడియా యత్నం
మాజీ పీఎస్ శ్రీనివాస్ పై ఐటీ దాడుల విషయమై ప్రస్తావిస్తూ చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సెటైర్లు విసిరారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ, తన దగ్గర పని చేసే పీఎస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయలు ఉన్నట్టు ఆధారాలు దొరికాయంటే అందులో తన ప్రమేయం ఉన్నట్టు కచ్చితంగా అనుమానం వస్తుందని, అది కామన్ సెన్స్ పాయింట్ అని అన్నారు.

‘చంద్రబాబునాయుడుగారి హిస్టరీ ఏంటి? గత చరిత్ర ఏంటి? ఆయన డబ్బుతోనే రాజకీయాలు చేస్తున్న వ్యక్తి. లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి కాదా? దాంతోనే రాజకీయాలు నడపాలనుకుంటున్న వ్యక్తి కాదా?’ అని ప్రశ్నించారు. మాజీ పీఎస్ పై ఐటీ దాడులతో చంద్రబాబు దొరికిపోయారని, బాబును కాపాడటం కోసం ఎల్లోమీడియా  ఎంత ప్రయత్నించినా అది సాధ్యపడే విషయం కాదని వ్యాఖ్యానించారు.
Ambati Rambabu
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News