రామ్ చరణ్ పై మండిపడుతున్న అల్లు అర్జున్ అభిమానులు!
- సూపర్ హిట్ గా నిలిచిన 'అల వైకుంఠపురములో'
- విజయంపై ఒక్క మాట కూడా మాట్లాడని రామ్ చరణ్
- సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న బన్నీ ఫ్యాన్స్
ఇక తాజాగా బన్నీ నటించిన 'అల వైకుంఠపురములో' సూపర్ హిట్ అయిన తరువాత, బన్నీ ఫ్యాన్స్ ఇప్పుడు రామ్ చరణ్ ను టార్గెట్ చేసుకున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఈ చిత్రం అతిపెద్ద హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇంతటి భారీ విజయాన్ని సాధించిన బన్నీకి, ఇండస్ట్రీలోని అన్ని వర్గాల నుంచి అభినందనలు దక్కాయి. ఒక్క రామ్ చరణ్ నుంచి మాత్రం విషెస్ రాలేదు.
సినిమా విడుదల కావడానికి ముందు తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టిన రామ్ చరణ్, ఆపై ఈ సినిమా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇదే సమయంలో 'జానూ' చిత్రాన్ని ప్రశంసిస్తూ ఓ పోస్ట్ పెట్టడం బన్నీ ఫ్యాన్స్ కు ఆగ్రహాన్ని తెప్పించింది.
ఘన విజయం సాధించిన 'అల వైకుంఠపురములో' గురించి మాట్లాడకుండా, చిన్న సినిమాను పొగడటాన్ని బన్నీ ఫ్యాన్స్ తప్పుపడుతున్నారు. ఇదే సమయంలో ఈ సినిమా విజయోత్సవ వేడుకల్లో చిరంజీవి నుంచి రామ్ చరణ్ వరకూ ఎవరూ కనిపించలేదు. ఇది కూడా ఫ్యాన్స్ ఆగ్రహానికి మరో కారణమని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఇక ఈ ఫ్యాన్స్ వార్ తారాస్థాయికి చేరకముందే రామ్ చరణ్ లేదా బన్నీ ఎమైనా స్పందిస్తారా? లేదా? అన్నది వేచి చూడాలి.